వైరల్: కొరియన్ యువతి నోట 'తెలుగు' పాట.. లక్షల్లో వ్యూస్

Korean women sung Sarangadariya song.సంగీతానికి హద్దులు లేవు అనడానికి ఈ అమ్మాయి పాడిన పాటే నిదర్శనం.

By అంజి  Published on  13 Sep 2021 4:15 AM GMT
వైరల్: కొరియన్ యువతి నోట తెలుగు పాట.. లక్షల్లో వ్యూస్

సంగీతానికి హద్దులు లేవు అనడానికి ఈ అమ్మాయి పాడిన పాటే నిదర్శనం. కొరియాకు చెందిన ఓ యువతి పాడిన తెలుగు పాట ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‌స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాటను పాడి అందరి చేత ఔరా అనిపించుకుంది. పాటకు తగ్గట్టుగా తన హావభావాలను పలికిస్తూ పాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు భాషలో ఆమె పాడిన సారంగ దరియాకు పాటకు నెటిజన్లు అందరూ ఫిదా అవుతున్నారు. ఈమె పాడిన పాటకు యూట్యూబ్‌లో ఇప్పటికే 9 లక్షల వ్యూస్ రావడం విశేషం

శేఖర్ కమ్ముల డైరెక్టన్‌లో రూపుదిద్దుకున్న లవ్‌స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాటను ప్రముఖ గాయని మంగ్లీ పాడారు. ఈ పాటకు ఇప్పటికే యూట్యూబ్‌లో 32 కోట్ల వ్యూస్ దాటాయి.

Next Story
Share it