ఆ పవర్ ఫుల్ టైటిల్ ను కొరటాల-ఎన్టీఆర్ సినిమా కోసం వాడుతున్నారా..?

Koratala Shiva NTR Movie Update. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమాతో పెద్

By Medi Samrat
Published on : 12 Nov 2022 8:47 PM IST

ఆ పవర్ ఫుల్ టైటిల్ ను కొరటాల-ఎన్టీఆర్ సినిమా కోసం వాడుతున్నారా..?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమాతో పెద్ద డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ తన తదుపరి సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో గతంలో "జనతా గ్యారేజ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి.

తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో నిర్మాత అయిన బండ్ల గణేష్ "దేవర" అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో నమోదు చేశారు. ఇప్పటికే చాలా కాలం గడిచింది కానీ ఆ టైటిల్ ను రెన్యువల్ చేయడం మర్చిపోయారు. దీంతో ఎన్టీఆర్30 సినిమా కోసం ఈ టైటిల్ ను కొరటాల శివ తీసుకున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని.. నటీనటుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.


Next Story