నిహారిక‌కు గాయం.. సేవ‌లు చేస్తున్న చైత‌న్య‌.. వైర‌ల్ అవుతున్న పోస్ట్‌

Konidela Niharika post goes viral. నిహారిక‌కు గాయం, దీంతో ఆమె విశ్రాంతి తీసుకుంటుండ‌డంతో చైత‌న్య సేవ‌లు చేస్తున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2021 8:06 AM GMT
Konidela Niharika post goes viral

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమారై నిహారికా వివాహాం చైత‌న్యతో 2020 డిసెంబ‌ర్ 9న జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నిహారిక త‌న అత్త‌గారింట్లో సంతోషంగా ఉంది. పెళ్లి అయినంత మాత్రాన నిహారిక త‌న న‌ట‌నా జీవితానికి దూరం కాలేదు. ప్ర‌స్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇటీవ‌ల షూటింగ్‌లో పాల్గొంది. షూటింగ్ చేస్తున్న క్ర‌మంలో నిహార‌ణ కాలికి దెబ్బ‌త‌గిలింది. వెంట‌నే ఆస్ప‌త్రికి వెళ్ల‌డంతో డాక్ట‌ర్లు చికిత్స చేసి కాలుకి క‌ట్టు క‌ట్టారు. కాలుకు ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టి నుంచి నిహారికా ఇంటికే ప‌రిమితం అయింది. దీంతో ఆమె విశ్రాంతి తీసుకుంటుండ‌డంతో చైత‌న్య సేవ‌లు చేస్తున్నాడు.ఇదిలా ఉంటే.. తాజాగా నిహారిక పెట్టిన ఓ ఫోటో పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


నిహారిక కాలు కనిపించేలా ఓ ఫోటోను క్లిక్ మనిపించారు. ఆ ఫోటో కింద 'మీరు మూడు కోరికలు కోరుకోవచ్చని జీనీ అడిగినట్లు, వాటికి తాను మూడు కోరికలుగా.. నిహారికా త్వరగా కోలుకోవాల'ని కోరుతున్నట్లు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త‌న ఇన్‌స్టా స్టోరీలో అదే ఫోటోను షేర్ చేసి.. బ్రోకెన్ వైఫ్‌ను తన భర్త పాంపర్ చేస్తున్నాడంటూ ట్యాగ్ లైన్ ఇచ్చింది. శ్రీమ‌తి మంచానికి ప‌రిమితం కావ‌డంతో భ‌ర్త‌కు సేవ‌లు త‌ప్ప‌వు క‌దా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నవ దంపతులు మధ్య ఉన్న ప్రేమకు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.

నిహారిక ప్ర‌ధాన పాత్ర‌లో రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తుండ‌గా.. ఇందులో యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.


Next Story
Share it