చదువుకున్న గొర్రె.. చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా..?

Kondapolam Official Trailer out.తొలి చిత్రం ఉప్పెన‌తో భారీ హిట్‌ను అందుకున్న హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sept 2021 4:20 PM IST
చదువుకున్న గొర్రె.. చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా..?

తొలి చిత్రం 'ఉప్పెన‌'తో భారీ హిట్‌ను అందుకున్న హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'కొండ‌పొలం'. క్రిష్‌ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న‌ప్ప‌టికి క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టీజర్‌, లిరికల్‌ సాంగ్ అభిమానుల‌ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం అక్టోబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ క్ర‌మంలో నేడు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం కోసం సిటీకి వెళ్లిన కుర్రాడు ఎదుర్కొ అవమానాలను చూపించారు. నల్లమల అడవిలో ట్రైనింగ్ తీసుకున్నాను అంటూ వైష్ణ‌వ్ చెప్పే డైలాగ్ ఈల వేయిస్తుంది. వైష్ణవ్‌, రకుల్‌ల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొండపొలంలో పోరాట సన్నివేశాలు అదిరిపోయాయి. ట్రైల‌ర్ చూస్తుంటే.. వైష్ణ‌వ్ తేజ్ ఖాతాలో మ‌రో హిట్ పడిన‌ట్లే క‌నిపిస్తోంది.

Next Story