ఆకట్టుకుంటోన్న 'కొండా' ట్రైల‌ర్‌.. 'పేరు గుర్తుందిగా.. నా పేరు..'

Konda Movie Trailer Released.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇటీవ‌ల కాలంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2022 6:04 AM GMT
ఆకట్టుకుంటోన్న కొండా ట్రైల‌ర్‌.. పేరు గుర్తుందిగా.. నా పేరు..

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే వార్త‌ల్లో నిలుస్తున్నారు. అయిన‌ప్పటికి రామ్‌గోపాల్ వ‌ర్మ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే ఆ చిత్రంపై మంచి అంచనాలే ఉంటాయి. ముఖ్యంగా బ‌యోపిక్‌ల‌ను వ‌ర్మ తెర‌కెక్కించిన‌ట్లుగా మ‌రొక‌రు తెర‌క‌క్కించ‌లేరు అంటే అతిశ‌యోక్తి కాదేమో. తాజాగా కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత క‌థ ఆధారంగా 'కొండా' అనే చిత్రం తెరకెక్కుతోంది.

గ‌ణ‌తంత్ర దినోవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను వ‌ర్మ విడుద‌ల చేశాడు. ఆర్జీవీ వాయిస్‌‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.'సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు.. బాగు చేయాలే.. నీకు పోయేదందుకు ఏం లేవు.. బానిస సంకెళ్ళు తప్ప.. విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైలు ఇంజన్లు.. పెత్తందార్లు పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి.. వీపరిత పరిస్థుతుల నుంచే వీపరిత వ్యక్తులు ఉద్భవిస్తారని క్లార్ మార్క్స్ 180 సంవత్సరాల క్రితమే చెప్పాడు.. అలాంటి వీపరిత పరిస్థుతుల మధ్యలో పుట్టినవాడే కొండా మురళి .. 'అంటూ వ‌ర్మ వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ సాగుతోంది.

ఈ చిత్రంలో కొండా ముర‌ళి పాత్ర‌లో అదిత్ అరుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. నిర్మాణ అనంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొంటోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story
Share it