'కోలో కోలన్న కోలో' అని పాడుకుంటున్న 'టక్ జగదీష్'‌

KoloKolanna Kolo​ Lyrical song fromTuck Jagadish.నేచుర‌ల్ స్టార్ న‌టిస్తున్న తాజా చిత్రం ట‌క్ జ‌గ‌దీష్. ఈ చిత్రంలో నాని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2021 12:00 PM IST
కోలో కోలన్న కోలో అని పాడుకుంటున్న టక్ జగదీష్‌

నేచుర‌ల్ స్టార్ న‌టిస్తున్న తాజా చిత్రం 'ట‌క్ జ‌గ‌దీష్'. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌లు న‌టిస్తున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో.. ఈ మూవీకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జోరుగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ టీజ‌ర్‌, 'ఇంకోసారి' పాట మంచి స్పంద‌న‌ను తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో ఈ చిత్రం నుంచి 'కోలో కోల‌న్న కోలో' అనే పాట‌ను విడుద‌ల చేశారు.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. అమ్రాన్ మాలిక్, హరిణి దీన్ని ఆలపించారు. ఈ సాంగ్‌లో ఫ్యామిలీ అంతా క‌లిసి సంద‌డి చేస్తుండ‌డం చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంది. షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో జగపతి బాబు, నాజర్, డేనియల్ బాలాజీ, ప్రియదర్శి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.




Next Story