కంగనాపై కేసు
Kolkata Police register case against Kangana Ranaut.బాలీవుడ్ నటి, పైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 8 May 2021 11:13 AM ISTబాలీవుడ్ నటి, పైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆమెపై కేసు నమోదైంది. సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టిందనే ఆరోపణలపై కంగనా రనౌత్ పై కేసు నమోదు చేశారు. తృణముల్ కాంగ్రెస్ ప్రతినిధి రిజు దత్తా చేసిన ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు కేసును పైల్ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోటోలను వక్రీకరించేలా కంగనా అప్‌లోడ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కంగనా పై పోలీసులు ఐపీసీ 153 ఎ, 504, 505 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 43,66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో విజయం సాధించిన మమతా.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి ఆ రాష్ట్రంలో భారీ అల్లర్లు చోటు చేసుకున్నాయి. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ, బీజేపీ కార్యకర్తలపై తృణముల్ కాంగ్రెస్ దాడికి పాల్పడుతున్నారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కంగనా ట్విట్టర్ వేదికగా వరుసగా వివాదాస్పద ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్విట్టర్ కూడా.. కంగనా మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని బావించి ఆమె అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేయగా.. దీనిపై కూడా కంగనా పైర్ అయ్యింది. ట్విట్టర్ అమెరికాది. ట్విట్టర్ నిషేధిస్తే.. నాకు మాట్లాడడానికి మరిన్ని మార్గాలున్నాయి. నా సినిమాల ద్వారా నోరు విప్పుతా అంటూ ఘాటుగా స్పందించింది.