స్నేహితురాలు చనిపోయిన రెండు రోజులకే.. మోడల్ మంజూషా నియోగి ఆత్మహత్య
Kolkata Model Manjusha Neogi Found Dead At Home.మరో బెంగాలీ మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. బిదిషా డి
By తోట వంశీ కుమార్ Published on
27 May 2022 7:01 AM GMT

మరో బెంగాలీ మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. బిదిషా డి మజుందార్ బలవన్మరణానికి పాల్పడి రెండు రోజులు కూడా గడవక ముందే ఆమె స్నేహితురాలు మోడల్ మంజూషా నియోగి ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని పటులి ప్రాంతంలో మంజూషా నియోగి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. నేడు(శుక్రవారం) ఉదయం ఆమె తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తన స్నేహితురాలు బిదిషా డి మజుందార్ బలవన్మరణానికి పాల్పడినప్పటి నుంచి మంజూషా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఆమె తల్లి చెబుతోంది. 'బిదిషాతో కలిసి ఉండాలనుకుంటున్నానని నా కూతురు ఎప్పుడూ చెబుతుండేది. బిదిషా గురించి నిరంతరం మాట్లాడేది. త్వరలో మీడియా బిదిషాలాగే మా ఇంటిపైనా దృష్టి పెడుతుందని ఆమె చెప్పినప్పుడు నేను ఆమెను తిట్టాను.' అని మంజూషా తల్లి చెప్పారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు.
Next Story