బిగ్‌బాస్ రియాలిటీ షో.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనే ఎంతో పాపులారిటీ పొందిన షో. అన్ని భాషల్లోనూ ప్రసారం అవుతుంది. తెలుగులో కూడా ఈ షో నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఐదు సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇక బిగ్ బాస్ షోను హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్ లో లోకనాయకుడు కమల్ హాసన్, అలాగే కన్నడలో సుదీప్ కిచ్చ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కన్నడ బిగ్ బాస్ నుంచి ఓ విషయం బయటకు వచ్చింది. కన్నడ బిగ్ బాస్ షో నుంచి హోస్ట్‌గా సుదీప్ తప్పుకుంటున్నాడని తెలుస్తోంది. కన్నడ బిగ్‌బాస్ సీజన్-8 త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హోస్ట్ కిచ్చ సుదీప్ మీడియాతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ కన్నడ రియాలిటీ షోకు హోస్ట్‌గా ఉండాలని మొదటగా నిర్వాహకులు అడిగినప్పుడు తనపై తనకు అనేక సందేహాలు కలిగాయని అన్నారు.
తాను హోస్ట్ గా వ్యవహరిస్తే ప్రేక్షులకు నచ్చుతుందా..? లేదా అనే భయం ఉండేదని, బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. కంటెస్టెంట్ల మధ్య గొడవ వల్ల తాను ఇబ్బంది పడ్డానని అన్నారు.ఆ సమయంలో షోకు బ్రేక్ ఇచ్చి వెళ్లిపోదామని అనుకున్నాను అని అన్నారు. ఐదు సీజన్ పూర్తయిన తర్వాత ఆరో సీజన్‌కు తాను హోస్టుగా చేయనని చెప్పగా, అందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు. ఎలాగో మళ్లీ హోస్టుగా చేసేలా ఒప్పించారని అన్నారు సుదీప్.