గాయ‌ప‌డిన‌ నటి.. షో అలాంటిది..!

Khatron Ke Khiladi 12 Kanika Mann injured doing stunts.హిందీ రియాలిటీ షో.. 'ఖత్రోన్ కే ఖిలాడీ 12′ త్వరలో టెలీకాస్ట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 10:43 AM GMT
గాయ‌ప‌డిన‌ నటి.. షో అలాంటిది..!

హిందీ రియాలిటీ షో.. 'ఖత్రోన్ కే ఖిలాడీ 12′ త్వరలో టెలీకాస్ట్ అవ్వనుంది. కేప్ టౌన్‌లో ఈ షో షూటింగ్ ప్రారంభం కాగా, కంటెస్టెంట్స్ చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎన్నో ప్రమాదకర విన్యాసాలు చేయడం ప్రారంభించారు. ఈ షోలో పాల్గొంటున్న వాళ్లకు రిస్క్ కూడా చాలానే ఉంటుంది. ఈ షోకు సంబంధించి కంటెస్టెంట్ అయిన కనికా మాన్ కు సంబంధించిన ఫోటో వైరల్ అవుతూ ఉంది. ఇందులో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఫోటో ఆన్‌లైన్ లో వైరల్‌గా మారింది.

ఈ షోలో కంటెస్టెంట్స్ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. తాజాగా ఓ స్టంట్ చేస్తూ కనికా మాన్ గాయపడింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను గాయపడ్డ విషయాన్ని ధృవీకరించింది. 'అవును, నాకు దెబ్బలు తగిలాయి. ఇదే విషయాన్ని రోహిత్‌ సర్‌కు కూడా చెప్పాను. దెబ్బలు బాగా తాకడంతో చేతులు, కాళ్లు కదపలేకపోతున్నానని తెలిపాను. దానికాయన ఏమన్నాడంటే ప్రేక్షకులకు నువ్వు గాయపడ్డ విషయం తెలియదు. వాళ్లు నువ్వు స్ట్రాంగ్‌ ప్లేయర్‌ అని భావిస్తున్నారు. నువ్వు షోలోనే ఉండి అదే నిజమని నిరూపించుకో అని చెప్పారు. నేనిప్పుడు అదే చేయబోతున్నాను' అని చెప్పుకొచ్చింది.

'ఖత్రోన్ కే ఖిలాడీ 12' జూలై 2 నుండి కలర్స్ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. మీరు ప్రతి శని మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు చూడవచ్చు. ఈ షోను బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్నారు. ఈసారి షోలో రుబీనా దిల్లక్, ప్రతీక్ సెహజ్‌పాల్, శ్రీతి ఝా, నిషాంత్ భట్, మిస్టర్ ఫైసల్ షేక్, శివంగి జోషి, జన్నత్ జుబైర్ , తుషార్ కలియా, మోహిత్ మాలిక్, ఎరికా ప్యాకర్డ్, చేతనా పాండే, కనికా మన్, అనెరి వజాని మరియు రాజీవ్ అదాతియాలు పాల్గొంటున్నారు.

Next Story