'సలార్'లో అతిధి పాత్రలో కనిపించనున్న రాకీ భాయ్..!
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో తనకంటూ
By Medi Samrat Published on 27 Aug 2023 7:30 PM IST‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం 'కేజీఎఫ్' మేకర్స్ తెరకెక్కిస్తున్న 'సలార్'లో కనిపించనున్నాడు. తాజాగా సలార్ గురించి పెద్ద న్యూస్ వైరల్ అవుతుంది. 'కేజీఎఫ్' యష్.. ప్రభాస్ 'సలార్'లో అతిధి పాత్రలో కనిపించనున్నాడనే చర్చ జరుగుతుంది.
ఈ ఏడాది రిలీజైన షారుఖ్ ఖాన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'పఠాన్'లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు కూడా చాలా సినిమాలలో పెద్ద స్టార్స్ అతిధి పాత్రలు చేయడం జరిగింది. ఇప్పుడు 'కేజీఎఫ్' స్టార్ యష్ 'సలార్'లో అతిధి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి.
Theatres Boooom🔥🥁😎#Salaar #Yash #Prabhas pic.twitter.com/2w5I83BL0Q
— RVCJ Kannada (@RVCJKannada) August 26, 2023
ప్రముఖ ట్విట్టర్ హ్యాండిల్ RVCJ ఒక పోస్ట్‌లో ప్రభాస్ 'సాలార్'లో యష్ 5 నిమిషాల అతిధి పాత్రను పోషించనున్నాడని తెలిపింది. అయితే ఈ విషయమై మేకర్స్ నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఇదే జరిగితే దక్షిణాదికి చెందిన ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.
ఇప్పటికే విడుదల తేదీ(సెప్టెంబర్ 28) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ పోస్ట్ చూసిన తర్వాత అభిమానులలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ప్రభాస్, యష్ కలిస్తే ఇక బద్దలవడానికి ఏ రికార్డులు ఉండవని అంటున్నారు.
మరోవైపు పలువురు నెటిజన్లు ఈ పోస్ట్‌ను ఫేక్ అని అంటున్నారు. ఇటువంటి పరిస్థితితులలో మేకర్స్ నుండి ఈ విషయంపై అప్‌డేట్ వచ్చేంత వరకూ 'సలార్'లో యష్ అతిధి పాత్రపై చర్చ జరుగుతూనే ఉంటుంది.