య‌శ్ వీరాభిమాని ఆత్మహత్య.. ఎమోష‌న‌ల్ అయిన కేజీఎఫ్ స్టార్‌

KGF star Yash's fan dies by suicide.య‌శ్అభిమాని ఒక‌రు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డడం విషాదాన్ని నింపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2021 3:28 PM IST
KGF star Yashs fan dies by suicide

కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు క‌న్న‌డ న‌టుడు య‌శ్‌. అయితే.. అత‌డి అభిమాని ఒక‌రు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డడం విషాదాన్ని నింపింది. కర్నాటక మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ (25) ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. చ‌నిపోయే ముందు సూసైడ్ నోట్‌లో తాను కేజీఎఫ్‌స్టార్‌ తోపాటు, కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ఇద్దరికీ అభిమాన‌ని.. వారిద్ద‌రూ త‌న అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకావాల‌ని అందులో కోరాడు.

'తల్లికి మంచి కొడుకుగా, అన్నయ్యకు మంచి సోదరుడిగా మారలేక పోయాను. చివరికి ప్రేమను గెలవడంలో కూడా విఫలమయ్యాను. ఇక జీవితంలో సాధించడానికి ఏమీలేదు' అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విష‌యం తెలిసిన‌ సిద్ధరామయ్య.. రామకృష్ణ మృతదేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో తన అభిమానిని కలుసుకోవడం బాధగా ఉందన్నారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకూడదని సూచించారు.


అభిమాని మరణించిన వార్త తెలుసుకున్న యశ్‌ ట్విట్టర్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. 'అభిమానుల అభిమానమే మాకు బలం, మాండ్యా రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది. అయితే తాము అభిమానుల నుంచి ఆశించేది ఇది కాదని, ఈలలు, చప్పట్లు మాత్రమే తాము కోరుకుంటామని' రాసుకొచ్చాడు.






Next Story