కొత్త సినిమాపై 'కేజీఎఫ్' స్టార్ యష్ కీలక ప్రకటన
కన్నడ హీరో యష్ నటించిన 'కేజీఎఫ్' సినిమా ఏప్రిల్ 2022లో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Jun 2023 2:33 AM GMTకొత్త సినిమాపై 'కేజీఎఫ్' స్టార్ యష్ కీలక ప్రకటన
కన్నడ హీరో యష్ నటించిన 'కేజీఎఫ్' సినిమా ఏప్రిల్ 2022లో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి యష్ తన కొత్త సినిమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది నుంచి ఆయన తన తదుపరి చిత్రాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యష్ మాత్రం చాలా సార్లు ఆ టాపిక్ నుండి తప్పించుకుంటు వచ్చాడు. ఇప్పటికే దర్శకులు శంకర్, పూరీ జగన్నాథ్, నితేష్ తివారీతో సహా పలువురు దర్శకులు యష్‌ని సంప్రదించి వారి స్క్రిప్ట్‌ల గురించి వివరించారు.
పూరి జగన్నాథ్ ప్రతిపాదనను తిరస్కరించగా.. శంకర్‌తో కలిసి పనిచేయడానికి యష్ ఆసక్తిగా చూపిస్తున్నాడు. అయితే దర్శకుడు శంకర్ ప్రస్తుతం "ఇండియన్ 2," "గేమ్ ఛేంజర్", "అపరిచితుడు" బాలీవుడ్ రీమేక్ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా ఉన్నాడు. వచ్చే మూడు సంవత్సరాల పాటు అతనికి కాల్షీట్లు లేవు. ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత నితేష్ తివారీ యొక్క పౌరాణిక 'రామాయణం' చిత్రంపై యష్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఇదిలా ఉంటే.. యష్ ఇటీవల మలయాళ చిత్రనిర్మాత గీతూ మోహన్‌దాస్ స్క్రిప్ట్‌పై ఆసక్తి చూపాడు. అతను ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకురావడానికి ఆసక్తిగా ఉన్నాడు. అయితే అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు అతనికి వ్యతిరేకంగా సలహా ఇస్తున్నారు. నిన్న ఓ దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో తన తదుపరి చిత్రాన్ని వచ్చే నెలలో అధికారికంగా ప్రకటిస్తామని అభిమానులకు ప్రకటించారు. గీతూ మోహన్ దాస్ సినిమాతో ఆయన ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.