రియ‌ల్ సూపర్ స్టార్‌.. 700 మందితో విడివిడిగా సెల్ఫీలు దిగిన రాకీభాయ్‌

KGF Star Yash Clicked Individual Pictures With Over 700 Fans.కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Dec 2022 12:37 PM IST
రియ‌ల్ సూపర్ స్టార్‌.. 700 మందితో విడివిడిగా సెల్ఫీలు దిగిన రాకీభాయ్‌

'కేజీఎఫ్' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్‌. ఈ సినిమాతో ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు క‌న్న‌డిగుల అభిమాన హీరోగానే ఉన్న య‌శ్ కేజీఎఫ్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా య‌శ్ చేసిన ఓ ప‌నికి అంద‌రూ ఫిదా అయ్యారు. సోష‌ల్ మీడియాలో రియ‌ల్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇటీవ‌ల బెంగ‌ళూరులో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మానికి య‌శ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు ఆయ‌న్ను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చారు. వారంతా య‌శ్‌తో సెల్ఫీలు తీసుకుంటామ‌ని అభ్య‌ర్థించ‌గా గ్రూప్ ఫోటోకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తామంటూ నిర్వాహ‌కులు చెప్పేశారు. ఇదంతా గ‌మ‌నించిన య‌శ్ కార్య‌క్ర నిర్వాహ‌కుల‌తో మాట్లాడాడు. అక్కఉకు వ‌చ్చిన‌ అభిమానులు అందరితో విడివిడిగా సెల్ఫీలు దిగాడు. ప‌ది మంది కాదు వంద మంది కాదు ఏకంగా 700 మందికి పైగా అభిమానులు య‌శ్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.

కాగా.. అభిమాను సెల్ఫీ సెష‌న్ పూర్తి కావ‌డానికి దాదాపు గంట‌న్న‌ర స‌మ‌యం ప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ య‌శ్ ఎంతో ఓపిక‌గా ఉండి అభిమానులు ఎవ్వ‌రిని నిరుత్సాహ ప‌ర‌చ‌లేదు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నిజ‌మైన సూప‌ర్ స్టార్ అంటే నువ్వే అని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌డ‌మంటే ఇది అంటూ ప్ర‌శంస‌లు కురిస్తున్నారు.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన 'కేజీఎఫ్' సిరీస్ చిత్రాలు సంచ‌ల‌న విజయాల‌ను అందుకున్నారు. రాకీభాయ్ కెరీర్‌లోనే 'కేజీఎఫ్ 2' అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం త‌రువాత మ‌రో చిత్రాన్ని ఇంత వ‌ర‌కు య‌శ్ ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. గ‌తంలోనే 'కేజీఎఫ్ 3' ఉంటుంద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

Next Story