కేజీఎఫ్ 2 టీజర్ వచ్చేసింది.. అంచ‌నాల‌ను పెంచేసింది

KGF Chapter 2 teaser released.కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం 'కేజీఎఫ్' 2 టీజర్ వచ్చేసింది.. అంచ‌నాల‌ను పెంచేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2021 3:47 AM GMT
KGF 2 Teaser

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం కేజీఎఫ్. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. విడుద‌లైన అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో దీనికి కొనసాగింపుగా వస్తున్న 'కేజీఎఫ్: చాప్టర్ 2' పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. 'కేజీఎఫ్ 2' ని ఎక్కడా రాజీ పడకుండా హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ రోజు య‌ష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. అమ్మకి ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే రాకీభాయ్ ని టీజర్ లో చూపించారు.

'పవర్ పుల్ పీపుల్ పవర్ ఫుల్ ప్లేషెస్ నుంచి వస్తారని చరిత్ర చెబుతోంది' అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ గూస్ బమ్స్ కలిగిస్తోంది. టీజర్ చివర్లో రాకీభాయ్ గా యష్ ఓ మెషిన్ గన్ పట్టుకొని కాల్చే సీన్ అద్భుతంగా ఉంది. కాలుతున్న మెషిన్ గన్ కి సిగరెట్ ముట్టించుకుంటూ యష్ కోపంగా చూడటంతో టీజర్ పూర్తయింది. మొదటి చాప్టర్ ని మించి ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయని అర్థం అవుతోంది. ర‌వి భాస్క‌ర్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రంలో య‌ష్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది. సంజయ్ దత్ అధీరా పాత్రలో క్రూరంగా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. 'కేజీఎఫ్ చాప్టర్ 1' లో మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2' లో సమాధానం లభించనుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
Next Story
Share it