కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

KGF Chapter 2 Release date fix.కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న న‌టుడు యశ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2021 7:32 PM IST
కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న న‌టుడు క‌న్న‌డ స్టార్ యశ్‌. ఈ చిత్రం సౌత్‌లో కంటే నార్త్‌లోనే భారీ హిట్‌ను అందుకుంది. కేజీఎఫ్ సినిమా సమయంలోనే సెకండ్ చాఫ్టర్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ చాప్ట‌ర్ టీజ‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా.. రికార్డులు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇక చిత్ర ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులంతా ఎద‌రుచూస్తున్నారు.


ఇక చెప్పిన సమయానికల్లా టంచనుగా అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర‌బృందం. ఈ చిత్రాన్ని జులై 16న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. దీంతో త్వరలోనే రాకీ భాయ్‌ వచ్చేస్తున్నాడోచ్‌ అంటూ అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం నిర్మాణ అనంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొంటోంది. సంజ‌య్ ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, రావు ర‌మేశ్ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ఇక మొద‌టి భాగంలో మిగిలిన అనేక ప్ర‌శ్న‌ల‌కు ఈ చిత్రంలో స‌మాధానం ల‌భించ‌నుంది. గ‌రుడ‌ను చంప‌డానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ ఆ త‌ర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు..? చ‌నిపోయాడు అనుకున్న అధీర ఎలా తిరిగొచ్చాడు..? ఇనాయత్ ఖ‌లీ భార‌త‌దేశంలోకి వ‌చ్చాడా..? అన్న‌ది తెలియాలంటే జులై 16 వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.


Next Story