కేజీఎఫ్ ఆండ్రూకు యాక్సిడెంట్

KGF actor BS Avinash meets with road accident in Bengaluru.కేజీఎఫ్ నటుడు బిఎస్ అవినాష్ బెంగళూరులో జిమ్‌కు వెళ్తుండగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2022 2:44 PM IST
కేజీఎఫ్ ఆండ్రూకు యాక్సిడెంట్

కేజీఎఫ్ నటుడు బిఎస్ అవినాష్ బెంగళూరులో జిమ్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైయ్యాడు. అతని మెర్సిడెస్ బెంజ్, ఒక ట్రక్కును ఢీకొట్టింది, అయితే అదృష్టవశాత్తూ అవినాష్ క్షేమంగా బయటపడ్డాడు. పెద్దగా ఎలాంటి గాయాలు కాలేదు. యష్ నటించిన యాక్షన్ చిత్రంలో అవినాష్ ఆండ్రూ పాత్రను పోషించడంతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. యాక్సిడెంట్ కు కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బుధవారం ఉదయం 6 గంట‌ల స‌మ‌యంలో అనిల్ కుంబ్లే సర్కిల్ సమీపంలో బిఎస్ అవినాష్ కారు నడుపుతుండగా.. అతని కారును ట్రక్కు ఢీకొట్టింది. మార్నింగ్ వాక్‌కి వెళ్లిన బాటసారులు నటుడిని రక్షించారు. ప్రమాదాన్ని చూసిన వారు అవినాష్‌ను కారులో నుంచి బయటకు తీశారు. క‌న్న‌డ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్‌లో అవినాష్ ఒక గ్యాంగ్‌ కు బాస్ అయిన ఆండ్రూ అనే పాత్రను పోషించాడు. కేజీఎఫ్ రెండు భాగాల్లోనూ కీలక పాత్రను పోషించాడు.

దివంగత నటుడు చిరంజీవి సర్జా ద్వారా అవినాష్‌కి కేజీఎఫ్ లో నటించే అవకాశం వచ్చింది. సర్జా స్నేహితుడి ద్వారా అవినాష్ కు సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడతో పరిచయం ఏర్పడింది. భువన్ గౌడ అతనిని ప్రశాంత్ నీల్‌కు పరిచయం చేశాడు.

Next Story