దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం.. ఎందుకంటే

Kerala theatre owners ban Dulquer Salmaan's films.లాక్‌డౌన్ స‌మ‌యంలో థియేట‌ర్లు మూతప‌డ‌డంతో ఓటీటీ హ‌వా మొద‌లైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2022 4:44 AM GMT
దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం.. ఎందుకంటే

లాక్‌డౌన్ స‌మ‌యంలో థియేట‌ర్లు మూతప‌డ‌డంతో ఓటీటీ హ‌వా మొద‌లైంది. ఇప్ప‌టికీ ఓటీటీలు త‌మ జోరును కొన‌సాగిస్తున్నాయి. థియేట‌ర్లు ఓపెన్ అయినా.. కొన్ని పెద్ద చిత్రాలు సైతం ఓటీటీలోనే విడుద‌ల అవుతున్నాయి అంటే వాటికున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన 'సెల్యూట్' చిత్రం ఓటీటీలో విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. దుల్క‌ర్ స‌ల్మాన్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఆండ్రూస్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మార్చి 18న ప్ర‌ముఖ ఓటీటీ సోనీ లివ్ స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే కేర‌ళ థియేట‌ర్ ఓన‌ర్లు.. దుల్క‌ర్ స‌ల్మాన్‌కు షాకిచ్చారు. దుల్క‌ర్ సినిమాల‌ను బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎందుకంటే.. సెల్యూట్ చిత్రాన్ని తొలుత థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే.. ఆ స‌మ‌యంలో క‌రోనా కార‌ణంగా విడుద‌ల‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ఓటీటీలో చిత్రాన్ని విడుద‌ల చేస్తుండ‌డంతో ఆగ్ర‌హించిన కేర‌ళ థియేట‌ర్ల ఓన‌ర్లు.. దుల్క‌ర్ సినిమాపై నిషేదం విధించారు. దుల్క‌ర్ న‌టించే ఏ చిత్రాన్ని కూడా తాము విడుద‌ల చేయ‌మ‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రి దీనిపై దుల్క‌ర్ స‌ల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Next Story
Share it