సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

Kerala music director Issac Thomas Kottukapally passes away.సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత దర్శకుడు కన్నుమూత.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2021 5:11 AM GMT
Kerala music director Issac Thomas Kottukapally passes away

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 72 సంవ‌త్స‌రాలు. చెన్నైలో గుండెపోటు కార‌ణంగా ఆయ‌న మృతి చెందారు. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ విషాదంలోకి వెళ్లింది. 'మన్ను' చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన థామస్‌ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. కొడైకెనాల్‌లోని అమెరికన్ టీచర్స్ స్కూల్ నుండి సంగీత కోర్సు పూర్తి చేసిన తరువాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్‌ గ్రేడ్‌ సాధించారు. థామ‌స్ మృతిపై కేరళ సాంస్కృతిక మంత్రి ఎకె బాలన్ సంతాపం ప్రకటించారు.

సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన ఆయన జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆయన లేని లోటు తీరనిది అంటూ మంత్రి ఎకె బాలన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. థామ‌స్ మృతిపై సినీ ఇండ‌స్ట్రీకు సంబంధించిన ప‌లువ‌రు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. 2011 చిత్రం ఆడమింటే మకాన్ అబూ, ఉత్తమ నేపథ్య స్కోర్‌తో సహా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకోవడమేకాదు ఆస్కార్‌కు కూడా నామినేట్‌ అయింది. వీటితోపాటు భావం (2002), మార్గం (2003), సంచరం అండ్‌ ఒరిడామ్ (2004) అనే నాలుగు చిత్రాలకు ఉత్తమ నేపథ్య సంగీతానికి స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు.


Next Story