శాక్రిఫైజ్ స్టార్‌ సునిశిత్‌ అరెస్ట్‌..!

Keesara police arrests Sacrifice star Sunishith.శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గుర్తున్నాడా..? అదేనండి యూ ట్యూబ్‌లో సినిమా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2021 4:29 AM GMT
శాక్రిఫైజ్ స్టార్‌ సునిశిత్‌ అరెస్ట్‌..!

శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గుర్తున్నాడా..? అదేనండి యూ ట్యూబ్‌లో సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతూ నిత్యం వార్త‌ల్లో నిలిచేవాడు. ఫ‌లానా సినిమా ఆఫ‌ర్ ముందుగా త‌న‌కే వ‌చ్చింద‌ని.. కానీ ఫ‌లానా స్టార్ హీరో అడిగితే.. త‌న‌కే ఇచ్చేశాన‌ని.. ఆ హీరోయిన్‌తో త‌న‌కు పెళ్లైంద‌ని ఇలా ఎన్నో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసేవాడు గ‌దా అత‌నే. తాజాగా పోలీసులు ఈ సోది స్టార్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. ఓ పోలీసు అధికారిపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశాడు. దీంతో స‌ద‌రు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుతో ద‌ర్త్యాప్తు చేప‌ట్టిన కీస‌ర పోలీసులు శుక్ర‌వారం అత‌డిని అరెస్ట్ చేశారు. త‌ప్పుడు వీడియో ఇచ్చిన‌ట్లు నిందితుడు ఒప్పుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు.

జనగాం జిల్లాకు చెందిన సునిశిత్ ఎంటెక్ వరకు చ‌దివాడు. అనంత‌రం ఓ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశాడు. అయితే.. ఆ స‌మ‌యంలో ఓ విద్యార్థినితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన కేసులో జైలుకి వెళ్లాడు. విడుద‌లైన అనంత‌రం ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ తీసుకున్నాడు. ఒకే రాత్రిలో స్టార్ కావాల‌ని అనుకున్నాడు. సినీప్ర‌ముఖుల‌పై విమ‌ర్శలు చేస్తే.. ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌న్న ఆశ‌తో వారిపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసేవాడు. గ‌తేడాది ప‌లువురు అత‌డిపై కేసులు పెట్ట‌డంతో.. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి త‌ర‌లించారు. విడుద‌లైన అనంత‌రం సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి.. మ‌ళ్లి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం మొద‌లుపెట్టాడు.

Next Story