బాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన సినిమా 'బేబీ జాన్' ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా ఆకట్టుకునే స్క్రీన్ కౌంట్ ను మొదటి రోజు దక్కించుకుంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. రిలీజ్ కు ముందు భారీగా ప్రమోషన్స్ చేయడమే కాకుండా స్క్రీన్‌లకు సంబంధించి భారీ కేటాయింపు కోసం తీవ్రంగా పోరాడారు. అయితే ఈ చిత్రం ప్రారంభ రోజు కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి.
కేవలం 10 కోట్ల రూపాయల నెట్ ను అందుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించింది, సల్మాన్ ఖాన్ కేమియో కూడా చేశాడు. అయినా కూడా సినిమాకు ప్లస్ గా నిలవలేదు. ఈ సినిమా కలెక్షన్స్ రెండవ రోజు పరిస్థితి మరింత దిగజారింది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా అనేక చోట్ల షోలను రద్దు చేశారు. చాలా థియేటర్లలో ఈ సినిమా స్థానంలో 'పుష్ప 2', 'ముఫాసా', 'మార్కో' వచ్చాయి. సెలవు రోజు విడుదల కూడా పెద్దగా ప్రయోజనం చేయలేదు. భారీ విడుదల ఉన్నప్పటికీ, బేబీ జాన్ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడంలో విఫలమైంది.