యునిసెఫ్ ఇండియాకు కొత్త సెలబ్రిటీ న్యాయవాదిగా నటి కీర్తి సురేశ్ నియామకం
జాతీయ అవార్డు గ్రహీత, నటి కీర్తి సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది.
By - Knakam Karthik |
యునిసెఫ్ ఇండియాకు కొత్త సెలబ్రిటీ న్యాయవాదిగా నటి కీర్తి సురేశ్ నియామకం
జాతీయ అవార్డు గ్రహీత, నటి కీర్తి సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆమె యునిసెఫ్ ఇండియాకు కొత్త సెలబ్రిటీ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఈ నటి తమిళం, తెలుగు, హిందీ మరియు మలయాళ సినిమాల్లో పనిచేశారు. ఇప్పుడు UNICEFతో కలిసి పిల్లల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులలో చేరనున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) ఇండియా విభాగానికి ఆమె సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు.
ఈ కొత్త బాధ్యతలు చేపట్టడం పట్ల కీర్తి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ‘‘ప్రతి చిన్నారికి సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం గౌరవంగా ఉంది’’ అని కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల శ్రేయస్సే దేశానికి పునాది అని తాను బలంగా నమ్ముతానని ఆమె వివరించారు.
Welcome to the @UNICEF family, Keerthy Suresh. 🩵 We are thrilled to have you as our newest UNICEF India Celebrity Advocate. Together, we’ll champion the rights and well-being #ForEveryChild in India.@KeerthyOfficial pic.twitter.com/DUPz7WJooS
— UNICEF India (@UNICEFIndia) November 13, 2025