బరాత్‌లో కీర్తి సురేష్ రచ్చ.. 'దసరా' నుండి ఫస్ట్‌లుక్‌ రిలీజ్

Keerthi Suresh First Look Potser Released From Dasara Movie. నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ' దసరా '. తాజాగా మూవీలో వెన్నెల పాత్రలో నటిస్తున్న

By అంజి  Published on  17 Oct 2022 4:13 PM IST
బరాత్‌లో కీర్తి సురేష్ రచ్చ.. దసరా నుండి ఫస్ట్‌లుక్‌ రిలీజ్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ' దసరా '. తాజాగా మూవీలో వెన్నెల పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'నేనుశైల‌జ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌య‌మైన కీర్తి సురేష్‌ తెలుగు త‌నంతో కూడిన అభిన‌యంతో ప్రేక్షకుల‌ను మాయ చేసింది. తాజాగా జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్‌ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సోమవారం ' దసరా ' మూవీ నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేశారు. నక్షత్రం పసుపు చీరను ధరించి, డ్రమ్మర్‌ల వేగవంతమైన దరువులకు కాలు కదుపుతున్నట్లు పోస్టర్‌లో కనిపిస్తుంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. 'దసరా' మూవీ మార్చి 30, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో అవుట్ అండ్‌ అవుట్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Next Story