కత్రినా కైఫ్‌కు కరోనా.. 'న‌న్ను క‌లిసిన వాళ్లు ప‌రీక్ష‌లు చేయించుకోండి'

Katina Kaif tested covid 19 positive.తాజాగా బాలీవుడ్ బ్యూటీ క‌త్రినాకైప్ కి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 12:31 PM
Katina Kaif

క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక బాలీవుడ్‌లోనూ ఈ మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల అక్ష‌య్‌కుమార్‌కు క‌రోనా సోక‌గా.. ఆయ‌న న‌టిస్తోన్న రామ‌సేతు చిత్ర యూనిట్ స‌భ్యుల్లో 40 మందికి పైగా ఆర్టిస్టులు క‌రోనా బారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ క‌త్రినాకైప్ కి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని.. త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంతా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరింది.



'నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. వెంట‌నే ఐసోలేష‌న్‌కు వెళ్లాను. ప్ర‌స్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నా. డాక్ట‌ర్ల సూచ‌న‌ల మేర‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా. ఇటీవ‌ల కాలంతో నాతో క‌లిసిన వాళ్లంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోండి. త్వ‌ర‌లోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వ‌స్తా. మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు' అని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే.. గ‌త కొంత‌కాలంగా క‌త్రినా కైప్ బాయ్ ప్రెండ్‌గా వార్త‌ల్లో నిలుస్తున్న విక్కీ కౌశల్ కూడా క‌రోనా బారిన ప‌డ్డాడు. కౌశ‌ల్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన మ‌రుస‌టి రోజే క‌త్రినా ప‌రీక్ష‌లు చేయించుకోగా ఆమెకు క‌రోనా సోకిన‌ట్లు తేలింది.


Next Story