హ్యాపీగా ఎకానమీ క్లాస్‌లో వెళ్లిన స్టార్ హీరో

Kartik Aaryan Flies Economy, Wins Hearts On The Internet. కార్తీక్ ఆర్యన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో. బడా హీరోలకు కూడా దక్కని హిట్స్, బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అతడికి దక్కుతూ

By అంజి  Published on  20 Sept 2022 5:22 PM IST
హ్యాపీగా ఎకానమీ క్లాస్‌లో వెళ్లిన స్టార్ హీరో

కార్తీక్ ఆర్యన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో. బడా హీరోలకు కూడా దక్కని హిట్స్, బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అతడికి దక్కుతూ ఉన్నాయి. తాజాగా అతడు ఎకానమీ క్లాస్ లో ప్రయాణించి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. కార్తీక్ ఆర్యన్ జోధ్‌పూర్ నుండి ముంబైకి తిరిగి వస్తున్నప్పుడు ఎకానమీ క్లాస్ విమానంలో ప్రయాణించాడు. అతడు అలా కనిపించడం.. ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయింది. ఫ్లైట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో కనిపిస్తోంది. అతడు విమానంలో తన తోటి ప్రయాణికులతో ఇంటరాక్ట్ అవుతూ కనిపించాడు.

వీడియోలో, కార్తిక్ ఫార్మల్ దుస్తులలో కనిపించడం మనం చూడవచ్చు. ఇటీవలే భూల్ భూలయ్యా 2లో భారీ హిట్ ను అందుకున్నాడు. పలువురు అతని నటనకు ప్రశంసించగా.. అతను "సో స్వీట్ ఆఫ్ యు", "ధన్యవాదాలు" అని చెబుతూ కనిపించాడు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. కార్తీక్ ఆర్యన్ ఈ వీడియో ఇంటర్నెట్‌లో అతని అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది. అలాగే కార్తీక్ ఆర్యన్ విమానంలో మ్యాగీ తింటూ కూడా కనిపించాడు.

కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్యా 2 విజయంలో బాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో టబు, కియారా అద్వానీ కలిసి నటించారు. కృతి సనన్‌తో రోహిత్ ధావన్ తెరకెక్కిస్తున్న షెహజాదా షూటింగ్ లో ఉండగా, కియారా అద్వానీతో 'సత్యప్రేమ్ కి కథ', ఆలయ ఎఫ్‌తో కలిసి 'ఫ్రెడ్డీ' లో కనిపించబోతున్నాడు.



Next Story