ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రింతంగా 'కార్తికేయ‌-2' ట్రైల‌ర్‌

Karthikeya 2 Trailer An Epic Mystical Adventure of Nikhil.యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న చిత్రం కార్తికేయ-2. కార్తికేయ‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2022 6:46 AM IST
ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రింతంగా కార్తికేయ‌-2 ట్రైల‌ర్‌

యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న చిత్రం 'కార్తికేయ-2'. కార్తికేయ‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ్ ఖేర్‌, ఆదిత్య మేన‌న్‌, శ్రీనివాస్ రెడ్డి లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 13న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ , మ‌ల‌యాళ బాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ర‌వితేజ విడుద‌ల చేశారు. 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం'అనే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. 'కృష్ణుడు ఉండేది చిన్న విష‌యం అనుకుంటున్నావా..? అరేబియ‌న్ స‌ముద్రం నుండి అట్లాంటిక్ మ‌హా స‌ముద్రం వ‌ర‌కు ముడిప‌డిన ఒక మ‌హా చ‌రిత్ర. ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మ‌రో వైద్యుడు నువ్వే' అంటూ ట్రైల‌ర్‌లో వినిపించిన డైలాగ్‌లు ఆస‌క్తిరేకెత్తించేలా ఉన్నాయి. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుంది.

Next Story