తక్కువ థియేటర్లు ఇచ్చినా.. దూసుకుపోతున్న కార్తికేయ 2
గత వారం బింబిసార, సీతారామం మంచి హిట్స్ గా నిలవగా.. ఈ వారం కార్తికేయ 2
By Medi Samrat Published on 14 Aug 2022 5:19 PM ISTటాలీవుడ్ ను వరుస హిట్స్ పలుకరిస్తూ ఉన్నాయి. గత వారం బింబిసార, సీతారామం మంచి హిట్స్ గా నిలవగా.. ఈ వారం కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కార్తికేయ 2'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం తొలి రోజే హిట్‌టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాకు తక్కువగా థియేటర్స్ లభించనప్పటికీ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్, రూ.5.05 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.5.30 కోట్ల గ్రాస్, రూ.3.50 కోట్ల షేర్ కలెక్షన్స్‌ని రాబట్టి నిఖిల్ కెరీర్‌లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'కార్తికేయ2' నిలిచింది.
కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు. వచ్చే వారం నుండి మరిన్ని థియేటర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
Next Story