ఆక‌ట్టుకుంటున్న కార్తికేయ 2 మోష‌న్ పోస్ట‌ర్

Karthikeya 2 Motion Poster out.చూడ‌గానే బాగా ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తిగా, మ‌న ప‌క్కింటి కుర్రాడిగా అనిపిస్తాడు హీరో నిఖిల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2022 12:16 PM IST
ఆక‌ట్టుకుంటున్న కార్తికేయ 2 మోష‌న్ పోస్ట‌ర్

చూడ‌గానే బాగా ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తిగా, మ‌న ప‌క్కింటి కుర్రాడిగా అనిపిస్తాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్ర‌స్తుతం మూడు చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి 'కార్తికేయ 2.' ఎనిమిదేళ్ళ క్రితం విడుదలైన 'కార్తికేయ' చిత్రానికిది సీక్వెల్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై వివేక్ కూచిభొట్ల‌, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. నేడు (జూన్ 1) నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. ఒక షిప్ లో హీరో నిఖిల్, శ్రీనివాసరెడ్డి, అనుపమా పరమేశ్వరన్ ఏదో మిషన్ పై బైలుదేరుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. స‌ముద్రం దాచుకున్న అతి పెద్ద ర‌హ‌స్యం ద్వార‌కా న‌గ‌రం అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో జులై 22న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Next Story