బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న కార్తికేయ-2

Karthikeya 2 Day 23 Box Office Collection Worldwide. తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ-2 సినిమా హవా కాస్త తగ్గినప్పటికీ.. నార్త్ ఇండియా, అమెరికాలో మాత్రం

By Medi Samrat  Published on  5 Sep 2022 1:40 PM GMT
బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న కార్తికేయ-2

తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ-2 సినిమా హవా కాస్త తగ్గినప్పటికీ.. నార్త్ ఇండియా, అమెరికాలో మాత్రం సినిమా దూసుకుపోతూ ఉంది. నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్ట‌ర్ గా 'కార్తికేయ‌-2' నిలిచింది. బాలీవుడ్‌లో 'బాహుబ‌లి', 'పుష్ప' చిత్రాల త‌ర్వాత ఆ స్థాయిలో హిందీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ను.. 50కోట్ల‌కు పైగా షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. 'కార్తికేయ‌-2' యూఎస్ఏలో 1.5 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించి రికార్డు సృష్టించింది. నాలుగో వారంలో 80 పైగా లోకేష‌న్ల‌లో ర‌న్ అవుతున్న‌మొద‌టి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.

'కార్తికేయ 2' చిత్రానికి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. సినిమాను తీసుకున్న వారు భారీగా లాభపడ్డారు. సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లు కాగా.. 23 రోజుల్లో రూ. 54.92 కోట్లు వచ్చాయి. ఇప్పటికి సినిమాకు రూ. 41.62 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిఖిల్‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు.


Next Story