ఖైదీకి సీక్వెల్ ఉందని తేల్చేసిన కార్తీ..!

Karthi says khaidi movie has sequel.తాజాగా హీరో కార్తీ ఖైదీకి సినిమా సీక్వెల్ ఉంటుందని తేల్చేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 1:34 PM GMT
karthi

కార్తీ-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..! ఈ సినిమా మొత్తం ఒక్క రాత్రిలో జరుగుతుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో.. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కిన సినిమా అందరికీ తెగ నచ్చేసింది. ఈ సినిమాలో ఢిల్లీ అనే పాత్రలో కార్తీ నటించాడు. ఈ సినిమా సీక్వెల్ ఉంటే బాగుణ్ణు అని చాలా మంది అభిప్రాయం చెప్పుకొచ్చారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా సీక్వెల్ ఉండొచ్చు అని చిన్న హింట్స్ ఇచ్చారు. అయితే తాజాగా హీరో కార్తీ ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని తేల్చేశాడు.

నేను ఎక్కడికి వెళ్లినా అంతా కూడా 'ఖైదీ' సీక్వెల్ ఎప్పుడు? అని అడుగుతున్నారు. త్వరలోనే సీక్వెల్ ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు కార్తీ. కార్తీ నటించిన 'సుల్తాన్' సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఏప్రిల్ 2న సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై కార్తి మాట్లాడుతూ, 'సుల్తాన్' సినిమా విశేషాలను గురించి ప్రస్తావించాడు. ఈ కథను తాను 20 నిమిషాల్లో ఓకే చేశాననీ, కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మూడేళ్లు పట్టిందని అన్నాడు. సుల్తాన్ సినిమా చాలా బాగుంటుంది. మా అన్నయ్య నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా చూసిన తర్వాత మా సుల్తాన్ సినిమా చూడండి అని కార్తీ అన్నాడు.

సుల్తాన్ సినిమా విషయానికి వస్తే.. మహాభారతంలోని ఓ పాయింట్ తీసుకొని సినిమాను రూపొందించారు. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన కాకుండా కౌరవులతో ఉంటే ఎలా ఉంటుందన్నదే సుల్తాన్ కథ. డ్రీమ్ వారియర్ పిక్చరస్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మాతలుగా బక్కిరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్, రొమాంటిక్ చిత్రం సుల్తాన్ ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Next Story