ఆ సినిమాను బ్యాన్ చేసిన కర్ణాటక ప్రభుత్వం

By Medi Samrat  Published on  7 Jun 2024 9:45 PM IST
ఆ సినిమాను బ్యాన్ చేసిన కర్ణాటక ప్రభుత్వం

పలు ముస్లిం సంస్థల అభ్యంతరాల నేపథ్యంలో 'హమారే బారా' అనే హిందీ సినిమా ప్రదర్శనపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. రెండు వారాల పాటు తాత్కాలిక నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఫిల్మ్ థియేటర్‌లు, ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లు.. ఇతర అవుట్‌లెట్‌లతో సహా అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా, దాని ట్రైలర్ విడుదలను ఆపివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వ ఆదేశాన్ని ఇచ్చింది.

సామాజిక శాంతికి విఘాతం కలిగించేందుకు, ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ముస్లిం సంఘాల నేతలు ఆరోపించారు. 'హమారే బారా' సినిమాలో అన్నూ కపూర్, అశ్విని కల్సేకర్, మనోజ్ జోషి, అభిమన్యు సింగ్, పార్థ్ సమతాన్, పరితోష్ త్రిపాఠి, అదితి భట్‌పహ్రీ, ఇష్లిన్ ప్రసాద్ తదితరులు నటించారు. రవి ఎస్ గుప్తా, బీరేందర్ భగత్, సంజయ్ నాగ్‌పాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కమల్ చంద్ర దర్శకత్వం వహించారు.


Next Story