బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ జంట ఖచ్చితంగా ఉంటుంది. బేబో కరీనా కపూర్ మరోసారి తల్లి అయ్యారు. ఆదివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కరీనా ముంబైలోని కాండీ ఆసుపత్రిలో ఉన్నారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌లు పెళ్లి చేసుకోగా.. ఈ దంపతులకు 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించారు. చిన్నప్పటి నుండి తైమూర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వరలో ఈ చిన్నారి వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. కాగా, కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో నటిస్తుంది. ఇక సైఫ్ అలీఖాన్ 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో చేయనున్నారు. అంతేకాకుండా 'ఫోన్ భూత్', 'ధరమ్‌సాలా' చిత్రాల్లలో కనిపించనున్నారు.