మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. పలు భాషల్లో స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇందులో లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్, రెబల్ స్టార్ ప్రభాస్ అతిధి పాత్రలు చేస్తున్నారు. ఆయా క్యారెక్టర్స్ కు చెందిన ఫస్ట్ లుక్‌లు ఇప్పటికే విడుదలయ్యాయి. కన్నప్ప చిత్రానికి సంబంధించి ఇప్పుడు వీరిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
ప్రభాస్, మోహన్‌లాల్‌లు కన్నప్ప సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించారట. తాజాగా మీడియా ఇంటరాక్షన్‌లో మంచు విష్ణు ఈ విషయాన్ని ధృవీకరించారు. తన తండ్రి, లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుపై ఉన్న ప్రేమ, గౌరవం కోసమే తాము ఈ సినిమా చేశామని కూడా ఆయన తెలిపారు. రుద్రగా ఈ చిత్రం నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ అవసరమైన బజ్ సృష్టించలేదు. కానీ శివ శివ శంకర అనే మొదటి పాటను విడుదల చేయగా.. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా టీమ్ అన్ని భాషల మీడియాతో కూడా ఇంటరాక్ట్ అవుతోంది. కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.