కాస్మోటిక్‌ సర్జరీ.. మొన్న ఆర్తీ అగ‌ర్వాల్‌.. నేడు చేతనా రాజ్ క‌న్నుమూత‌

Kannada TV actor Chethana Raj passes away after her fat surgery goes wrong.వెండి తెర లేదా బుల్లి తెర ఏదైనా కానీవ్వండి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 May 2022 6:35 AM GMT
కాస్మోటిక్‌ సర్జరీ.. మొన్న ఆర్తీ అగ‌ర్వాల్‌.. నేడు చేతనా రాజ్ క‌న్నుమూత‌

వెండి తెర లేదా బుల్లి తెర ఏదైనా కానీవ్వండి.. ఇందులో రాణించాలంటే టాలెంట్ తో పాటు అందంగా ఉండాల్సిందేన‌ని కొంద‌రు బావిస్తుంటారు. అందుక‌నే న‌టీ న‌ట్లులో చాలా మంది తాము అందంగా క‌నిపించేందుకు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం ఇటీవ‌ల కాలంలో ప‌రిపాటిగా మారింది. అయితే.. ఈ స‌ర్జీరీలు విక‌టించి ప‌లువురు మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. స‌న్న‌గా మారేందుకు టాలీవుడ్ న‌టి ఆర్తీ అగ‌ర్వాల్ లైపోసక్షన్ చేయించుకోగా.. అది విక‌టించి ప్రాణాలు కోల్పోగా తాజాగా క‌న్న‌డ‌ బుల్లితెర న‌టి చేత‌నా రాజ్ క‌న్నుమూసింది. కాస్మోటిక్‌ సర్జరీనే ఆమె ప్రాణాలు బ‌లిగొన్నద‌ని అంటున్నారు. కాగా.. చేత‌నా రాజ్ వ‌య్సస్సు 21 సంవ‌త్స‌రాలు.

చేతనా రాజ్.. కన్నడ టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. చిన్న వ‌య‌స్సులో బుల్లితెర‌పై ప‌లు టీవీ షోలు, సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌కు చేరువ అయ్యింది. కాగా.. ఫ్యాట్ ఫ్రీ కోసం చేతనా రాజ్ కాస్మొటిక్ సర్జరీని అశ్రయించినట్టు తెలుస్తోంది. బెంగళూరులోని డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో సోమవారం (మే 16న) ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అయితే.. సాయంత్రం ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో బాగా ఇబ్బంది పడ్డారట.

ఆ ఆస్ప‌త్రిలో ఐసీయూ అందుబాటులో లేక‌పోవ‌డంతో మంజునాథ్ న‌గ‌ర్‌లోని క‌డే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. ఆస్ప‌త్రికి త‌ర‌లించేట‌ప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు అక్క‌డి వైద్యులు వెల్ల‌డించారు. అంతే కాదు... చేతనా రాజ్‌ను తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. స‌ర్జ‌రీపై చేత‌నా రాజ్ కుటుంబ స‌భ్యుల‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. స్నేహితుల‌తో క‌లిసి ఆమె ఆస్ప‌త్రికి వ‌చ్చిన‌ట్లు వారు వెల్ల‌డించారు. తమ కుమార్తె మరణానికి కాస్మొటిక్ సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని చేతనా రాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చేతనా రాజ్ మరణించడం పట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Next Story
Share it