మ‌రో విషాదం.. పునీత్‌ రాజ్‌కుమార్ ఇక‌లేరు.. శోకసంద్రంలో అభిమానులు

Kannada Super Star Puneeth Rajkumar Passed away.సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2021 9:14 AM GMT
మ‌రో విషాదం.. పునీత్‌ రాజ్‌కుమార్ ఇక‌లేరు.. శోకసంద్రంలో అభిమానులు

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 46 సంవ‌త్స‌రాలు. ఈ రోజు(శుక్ర‌వారం) ఉద‌యం 9.45 గంట‌ల‌కు ఇంట్లో జిమ్ చేస్తుండ‌గా.. పునీత్‌కు గుండెపోటు రావ‌డంతో ఒక్క‌సారిగా కుప్ప‌కూలి ప‌డిపోయారు. గ‌మ‌నించిన కుటుంబ‌సభ్యులు ఆయ‌న్ను బెంగ‌ళూరులోని విక్ర‌మ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆస్ప‌త్రి తీసుకువ‌చ్చే స‌మ‌యానికే స‌మ‌యానికే ఆయ‌న ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు. పునీత్ మ‌ర‌ణ‌వార్త‌తో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, క్రీడాకారులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

పునీత్ రాజ్‌కుమార్ మృతి చెంద‌డంతో క‌ర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో థియేట‌ర్స్ అని మూసివేశారు. క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మె ప్ర‌స్తుత ప‌రిస్థితిపై అధికారుల‌తో స‌మీక్షిస్తున్నారు. ఇప్ప‌టికే పునీత్ సోద‌రుడు శివ‌రాజ్‌కుమార్‌, క‌న్న‌డ న‌టీన‌టులు ఆస్ప‌త్రికి చేరుకున్నారు. మ‌రోవైపు పునీత్ అభిమానులు పెద్ద సంఖ్య‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లివ‌స్తున్నారు.

పునీత్‌ని అభిమానులు ఎంతో ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ కొడుకే పునీత్‌ రాజ్‌కుమార్‌. 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్ సుమారు 14 సినిమాల్లో బాలనటుడిగా న‌టించారు. 2002లో అప్పు (తెలుగులో ఇడియ‌ట్‌) తో హీరోగా మారారు. ఆ త‌రువాత వ‌రుసగా విజ‌యాల‌తో దూసుకెళ్లారు. వీర క‌న్న‌డిత‌. అర‌సు, మిల‌నా, వంశీ, రాజ్, జాకీ, రాజ‌కుమార‌, యువ‌ర‌త్న సినిమాల‌లో న‌టించి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా ఆయ‌న 32 సినిమాల్లో న‌టించారు.

Next Story
Share it