క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌లు పూర్తి

Kannada Power Star Puneet Raj Kumar last rituals completed.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Oct 2021 3:12 AM GMT
క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌లు పూర్తి

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌లు ముగిసాయి. ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల మ‌ధ్య ఆదివారం ఉద‌యం పునీత్ అంతిమ సంస్కారాలు జ‌రిగాయి. కంఠీరవ స్టూడియోలోని తల్లిదండ్రుల సమాధుల ప‌క్క‌నే పునీత్ అంతిమ సంస్కరాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. పునీత్ అన్న కుమారుడు విన‌య్ అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హించారు. అంత్యక్రియల్లో పునీత్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

సీఎం బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ త‌దిత‌రులు పాల్గొని క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. అంత‌క‌ముందు తెల్ల‌వారుజామున 4.30గంట‌ల స‌మ‌యంలోనే పునీత్ అంతిమ యాత్ర ప్రారంభ‌మైంది. కంఠీర‌వ స్టేడియం నుంచి కంఠీర‌వ స్టూడియో వ‌ర‌కు భారీ కాన్వాయ్ మ‌ధ్య పునీత్ అంతిమ‌యాత్ర నిర్వ‌హించారు. ఈ అంతిమ‌యాత్ర‌లో వేలాది మంది పాల్గొన్నారు. అభిమానుల నినాదాల‌తో ఆ ప్రాంతం అంతా మారుమోగింది. పునీత్ మ‌ర‌ణించి రెండు రోజులు అవుతున్న‌ప్ప‌టికీ త‌మ అభిమాన న‌టుడు ఇక లేర‌న్న విష‌యాన్ని ఆయ‌న అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Next Story
Share it