పెళ్లి విషయంలో ఫ్యామిలీ ఒత్తిడి..ప్రముఖ నటి సూసైడ్

ప్రముఖ సీరియల్ నటి నందిని (20) ఆత్మహత్యకు పాల్పడటం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

By -  Knakam Karthik
Published on : 30 Dec 2025 11:33 AM IST

Cinema News, Kannada, Tamil Television, actress Nandini, serial actress death

పెళ్లి విషయంలో ఫ్యామిలీ ఒత్తిడి..ప్రముఖ నటి సూసైడ్

తమిళ టెలివిజన్ రంగంలో తక్కువ వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీరియల్ నటి నందిని (20) ఆత్మహత్యకు పాల్పడటం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనతో ఆమె అభిమానులు, సహ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నందిని నివాసంలో ఓ సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఆ లేఖలో కుటుంబ సభ్యులు తనపై పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఆ మానసిక వేదనను తట్టుకోలేకపోయానని నందిని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై స్పష్టత ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. నందిని తక్కువ కాలంలోనే తన నటనతో మంచి అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా తమిళ సీరియల్ 'గౌరి'లో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదే సీరియల్‌లో ఇటీవల ఆమె పాత్ర ఆత్మహత్యాయత్నం చేసే సన్నివేశం ప్రసారమవడం గమనార్హం.

Next Story