'అశ్లీల చిత్రాలలో నటిస్తావా' అంటూ.. నటికి యూట్యూబర్ ప్రశ్న.. పోలీసులకు ఫిర్యాదు

'అశ్లీల చిత్రాలలో నటిస్తావా' అని అడిగినందుకు యూట్యూబర్‌పై కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అతనిపై చట్టపరమైన చర్యలు

By అంజి  Published on  4 April 2023 12:00 PM IST
Kannada actress, YouTuber

Kannada actress files police complaint against YouTuber

'అశ్లీల చిత్రాలలో నటిస్తావా' అని అడిగినందుకు యూట్యూబర్‌పై కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌లో సదరు నటి ఫిర్యాదు చేసింది. యూట్యూబర్‌ని సుషాన్‌గా గుర్తించారు.

"నగ్న చిత్రాలలో నటిస్తావా అని సుషాన్ నన్ను అడిగాడు. నేను ఎన్నో ఒడిదొడుకులతో నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. నేను ఇప్పటివరకు చిన్న పాత్రలలో నటించాను. కన్నడ 'పెంటగాన్' చిత్రంలో ప్రధాన పాత్రను కైవసం చేసుకున్నాను" అని ఆమె చెప్పింది. ఆ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడు ఆమెను ఇబ్బందికరమైన ప్రశ్న అడిగిన తర్వాత నటి.. 'నేను బ్లూ ఫిల్మ్ స్టార్ కాదు, అసలు అలాంటి ప్రశ్న ఎందుకు అడగాలి?.. అడిగే ముందు ఆలోచించవా' అంటూ ఫైర్‌ అయ్యింది. యూట్యూబర్‌కు "కామన్ సెన్స్ లోపించిందని" కూడా తిట్టింది.

"కన్నడ చిత్ర పరిశ్రమలో అశ్లీల సినిమాలు ఎవరు తీస్తున్నారు? ఎందుకు ఇలాంటి సభ్యత లేని పశ్నలు అడిగారు" అంటూ యూట్యూబర్‌పై నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు నటి.. ప్రముఖ టీవీ సీరియల్ నటి. 'పెంటగాన్' చిత్ర నిర్మాతలు ఆమె నటించిన పాటను విడుదల చేశారు. ఈ పాటలో నటి బోల్డ్ సన్నివేశాలు చేసింది. ఇది సినీ ప్రేక్షకుల నుండి చాలా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని నటి ఆరోపించింది. నిందితుడు యూట్యూబర్ తనకు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Next Story