హీరో కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్‌ కన్నుమూశారు.

By అంజి  Published on  20 Oct 2024 1:03 PM IST
Kannada actor, Kichcha Sudeep, Sudeep mother passes away

హీరో కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్‌ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆమె వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని జయనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం జేపీ నగర్‌లోని వారి నివాసానికి తీసుకురానున్నారు.

కిచ్చా సుదీప్‌కు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు విల్సన్‌ గార్డెన్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. సుదీప్ త‌ల్లి మరణించిందన్న వార్త తెలుసుకున్న సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అమెకు సంతాపం తెలుపుతున్నారు. తన తల్లి అంటే తనకెంతో ఇష్టమని బిగ్‌బాస్‌, ఇతర ఇంటర్వ్యూలు, వేదికలపై సుదీప్‌ చెప్తుండేవారు. 'ఈగ', విక్రాంత్‌ రోణ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Next Story