హమ్మయ్య.. గుడ్ న్యూస్ చెప్పిన కంగనా రనౌత్

తన సినిమా ఎమర్జెన్సీకి ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతి లభించిందని నటి కంగనా రనౌత్ ప్రకటించారు

By Medi Samrat  Published on  17 Oct 2024 9:15 PM IST
హమ్మయ్య.. గుడ్ న్యూస్ చెప్పిన కంగనా రనౌత్

తన సినిమా ఎమర్జెన్సీకి ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతి లభించిందని నటి కంగనా రనౌత్ ప్రకటించారు. అక్టోబర్ 17న ఎక్స్‌లో.. చిత్ర బృందం సెన్సార్ సర్టిఫికేట్‌ను పొందిందని, త్వరలో చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని కంగనా వెల్లడించింది. తన అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతుకు కంగనా కృతజ్ఞతలు తెలిపారు.

కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా కోసం సినీ అభిమానులే కాదు, పొలిటికల్ లీడర్స్ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత థియేటర్లలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ సెన్సార్ కార్యక్రమాల వలన సినిమా వాయిదా పడింది. CBFC అన్ని నిబంధనలను అంగీకరించిన తర్వాత, ఎమర్జెన్సీ టీమ్ పంజాబ్ ఎన్నికల తర్వాత చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. రనౌత్ దర్శకత్వం వహించిన, నటించిన ఎమర్జెన్సీ 1975 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సంఘటనలను వివరిస్తుంది.

Next Story