విలేక‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కంగ‌నా.. 'కూర్చోండి.. నేను అంత అమాయ‌కురాలిని కాదు'

Kangana Ranaut slams journalist.బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ను అభిమానులు ముద్దుగా ఫైర్ బ్రాండ్ అని పిలుచుకుంటూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 11:33 AM IST
విలేక‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కంగ‌నా.. కూర్చోండి.. నేను అంత అమాయ‌కురాలిని కాదు

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ను అభిమానులు ముద్దుగా ఫైర్ బ్రాండ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఏ విష‌యంపైనా అయినా ఆమె ఎలాంటి బెరుకు లేకుండా కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా మాట్లాడ‌డ‌మే అందుకు కార‌ణం. తాజాగా ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పిడ‌మే కాకుండా.. ఇక కూర్చో అంటూ విలేక‌రిని ఉద్దేశించి అంది.

వివ‌రాల్లోకి వెళితే.. 'లాక్ అప్' అనే రియార్టీ షో కి కంగ‌నా వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హరిస్తోంది. ఓటీటీ వేదిక‌గా మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ రియార్టీ షోకి సంబంధించిన ఫార్మాట్‌ను తెలియ‌జేసేందుకు గురువారం విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ విలేక‌రి.. 'గెహ్రాయాన్' చిత్ర‌ ప్రమోషన్స్‌లో దీపికా డ్రెస్సింగ్ గురించి అడిగారు. 'మేడ‌మ్ ఈ మ‌ధ్య కాలంలో మ‌హిళ ధ‌రించిన దుస్తులు ఆధారంగా ఎదుటివాళ్లు ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై కామెంట్ చేస్తున్నారు. ఇటీవ‌ల దీపిక కూడా ఇలాంటి నెగ‌టివిటీని ఎదుర్కొన్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు' అని ప్ర‌శ్నించారు.

దీంతో కంగ‌నా కోపంగా.. 'చూడండి.. తమను తాము రక్షించుకోలేని వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. సరేనా? ఆమె(దీపిక‌) తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు ఏం చేయాలో తెలుసు, కాబట్టి ఆమె సినిమాను ఇక్కడ ప్రమోట్ చేయలేను. కూర్చో' అంటూ కాస్త గ‌ట్టిగానే చెప్పింది. ఆ సినిమాని ప్ర‌మోట్ త‌న ఉద్దేశం కాద‌ని ఆ విలేక‌రి చెప్ప‌గా.. 'అది నిజం కాద‌ని, ఇక్క‌డ ఆ సినిమా పేరుని ప్ర‌స్తావించారు. నేను అంత అమాయకురాలిని కాదు. గ‌త న‌ల‌భై ఐదు నిమిషాలుగా నేను మీతోనే మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని తర్వాత చూసుకుందాం అని కంగ‌నా కాస్త గ‌ట్టిగానే చెప్పింది.

Next Story