తప్పని నిరూపించండి.. పద్మశ్రీ వెనక్కిచేస్తా : కంగన
Kangana Ranaut says she will return Padma.తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2021 10:07 AM GMTతాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పింది. పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌పై తాజాగా కంగనా స్పందించింది. ఇటీవల కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని.. 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కంగనా చేసిన వ్యాఖ్యలు స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్ర సమరయోదులను అవమానించేలా ఉన్నాయాని.. ఆమెను అరెస్టు చేయాలంటూ వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇటీవల ప్రధానం చేసిన పద్మ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని కాంగ్రెస్, శివసేనలతో పాటు పలువురు డిమాండ్ చేశారు.
వీటిపైనే కంగనా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో 'జస్ట్ టు సెట్ ది రాకార్డ్స్ స్ట్రేట్' అనే పుస్తకంలోని పేజీని షేర్ చేస్తూ ఆ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 1857లో స్వాతంత్రం కోసం తొలి పోరు జరిగిందన్నారు. దేశ స్వాతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయ్, వీర్ సావర్కర్ తదితరుల ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. రాణీ లక్ష్మీబాయి జీవిత చరిత్రపై తీసిన సినిమాలో తాను నటించానని తెలిపింది.
'ఆ చిత్రంలో నటించేందుకు 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటంపై విస్తృత పరిశోధన చేశాను. అప్పుడు జాతతీయవాదం పెరిగింది. అయితే.. ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయింది. భగత్‌సింగ్, నేతాజీ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది..? వారికి గాంధీ ఎందుకు మద్దతు తెలుపలేదు..? ఎందుకు విభజన రేఖను తెల్లవ్యక్తి గీయాల్సి వచ్చింది..? స్వాతంత్ర్యాన్ని వేడుకగా చేసుకోవాల్సింది. గానీ ఒకరినొకరిని ఎందుకు చంపుకున్నారు..? ఈ ప్రశ్నలంన్నింటీనీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను' అని కంగనౌ చెప్పింది. 1857 పోరాటం గురించి తనకు తెలుసని.. అయితే 1947లో ఏం జరిగింది తెలియదనీ.. ఈ విషయంలో తనకు ఎవరైనా అవగాహన కల్పిస్తే తప్పకుండా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేసి.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపింది.