కరోనాను జయించిన కంగనా
Kangana Ranaut Says She Tested Negative For COVID-19. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనాను జయించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు.
By Medi Samrat Published on 18 May 2021 8:11 PM ISTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనాను జయించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ కరోనా నుంచి కోలుకున్నారు. తనకు కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు ఆమె స్వయంగా తెలిపారు. ఈ నెల 8న తనకు కరోనా సోకినట్టు కంగన సోషల్ మీడియా ద్వారా చెప్పారు.
కరోనాను తాను ఎలా ఎదుర్కొన్నాననే విషయాన్ని చెప్పాలని ఉన్నప్పటికీ, కోవిడ్ ఫ్యాన్ క్లబ్స్ ను నిరాశపరచాలనుకోవడం లేదని కౌంటర్లు వేశారు కంగనా. వైరస్ గురించి తప్పుగా మాట్లాడితే మనను విమర్శించే వారు కూడా ఎంతో మంది ఉన్నారని.. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది. కరోనా సమయంలో చేయాల్సినవి.. చేయకూడనివి అంటూ పలు సూచనలు ఇస్తూ కంగనా వీడియోను కూడా అప్లోడ్ చేశారు.
కంగనా రనౌత్ ఐసోలేషన్ లో ఉంటూ పలు అంశాలపై తన వైఖరిని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నారు. పలు అంశాలపై స్పందించిన కంగనా గంగానదిలో శవాల వార్తలపై కూడా తన వైఖరిని తెలియజేశారు. యూపీ, బీహార్ రాష్ట్రాల్లో గంగానదిలో పదుల సంఖ్యలో శవాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపగా.. కంగనా మాత్రం గంగా నదిలో శవాలు కొట్టుకు వచ్చాయన్న వార్తలలో నిజం లేదని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోలు నైజీరియా దేశంలో జరిగిన సంఘటనలకు సంబంధించినవి అని అన్నారు. దీనిపై కూడా కంగనా రనౌత్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.