కంగనా రనౌత్.. కఠినమైన వ్యాఖ్యలు

Kangana Ranaut says 'everyone who called Ayan Mukerji genius should be jailed immediately'. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

By Medi Samrat  Published on  10 Sept 2022 8:30 PM IST
కంగనా రనౌత్.. కఠినమైన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమాపై విమర్శలు గుప్పించింది. ఈ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాతల్లో ఒకడైన కరణ్ జోహార్ లపై ప్రముఖ నటి కంగన రనౌత్ తీవ్ర విమర్శలు చేసింది. కంగనా గతంలో కూడా పలు మార్లు కరణ్ జోహార్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు బ్రహ్మాస్త్ర విడుదలయ్యాక దర్శకుడు అయాన్ ముఖర్జీని పొగుడుతూ ఉన్నారు. అతడిని పొగడంపై కంగనా ఫైర్ అయ్యారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీని మేధావి అని పిలుస్తుండడం హాస్యాస్పదంగా ఉందని.. బ్రహ్మాస్త్ర సినిమా తీసేందుకు 12 ఏళ్ల సమయం పట్టిందని, ఈ సినిమాకు 12 మంది కెమెరామన్లు మారారని, 85 అసిస్టెంట్ డైరెక్టర్లు మారారని కంగనా అన్నారు. అతడి మూలంగా రూ.600 కోట్ల ప్రొడక్షన్ డబ్బు బూడిదలో పోసిన పన్నీరైందని, అతడు మేధావి ఎలా అవుతాడని విమర్శించారు. అతడిని ఎవరైనా జీనియస్ అంటే వారిని జైల్లో పెట్టాలని పిలుపునిచ్చారు. టాలెంట్ ఉన్నవాళ్లతో సినిమా చేయకుండా, సినిమా ప్రమోషన్ కోసం దక్షిణాదివాళ్లపై కరణ్ జోహార్ ఆధారపడ్డాడని విమర్శించారు. తన సినిమాల స్క్రిప్టులు ఎలా ఉన్నాయో పట్టించుకోని కరణ్ జోహార్ కు ఇతరుల లైంగిక జీవితాలపై ఆసక్తి ఎక్కువని విమర్శలు చేశారు. తన సినిమాలకు రివ్యూలు, రేటింగులు, వసూళ్ల వివరాలు ఇలా అన్నీ కొనుగోలు చేస్తుంటాడని ఆరోపించింది కంగనా.





Next Story