చై-సామ్ విడాకులకి కారణం అతడే.. కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Reacts to Samantha Naga Chaitanya's divorce.స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత తమ బంధానికి పుల్‌స్టాప్
By తోట వంశీ కుమార్ Published on 3 Oct 2021 11:17 AM ISTస్టార్ కపుల్ నాగచైతన్య-సమంత తమ బంధానికి పుల్‌స్టాప్ పెడుతున్న విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కొందరు వారికి మద్దుతుగా మాట్లాడుతుండగా.. వర్మలాంటి వాళ్లు మంచిపని చేసినట్లుగా చెప్పేస్తున్నారు. అక్కినేని జంట విడిపోవడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. ఓ బంధం విఫలమైతే అందుకు మగవారే కారణమని ఆమె వ్యాఖ్యానించింది. చై, సామ్ విడిపోవడానికి కారణం ఓ బాలీవుడ్ నటుడు అని చెప్పుకొచ్చింది.
ఏ జంట విడాకులు తీసుకున్నా అందుకు మూల కారణం పురుషుడేనని.. వినడానికి ఇది ఒక తీర్పులా అనిపించినా.. ఇందులో నిజం లేకపోలేదని చెప్పింది. 'దేవుడు పురుషులను ఎలా సృష్టించాడో స్త్రీని కూడా అలాగే సృష్టించాడు. మహిళలను బట్టల్లా మార్చుకుని, వారిని మీ బెస్ట్ ఫ్రెండ్ అని పిలిచే వారిపై జాలి చూపడం ఆపండి. వందలో ఒక మహిళ తప్పు కావచ్చు, కానీ పూర్తిగా కాదు. విడాకుల సంస్కృతి మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది. ఈ ఆకతాయిలు అభిమానుల నుండి ప్రశంసలు అందుకోవడం సిగ్గుచేటు' అని కంగనా తెలిపింది.
ఇక చైతు-సమంత విడాకుల విషయం గురించి మాట్లాడుతూ.. తాజాగా విడాకులిచ్చిన సౌత్ హీరో, కొన్ని రోజుల కిందట ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని, ఆ వెంటనే తన భార్యకు సౌత్ హీరో విడాకులిచ్చాడని పేర్కొంది. పెళ్లి కంటే ముందు సౌత్ హీరో తన భార్యతో 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారని.. ఇటీవల విడాకుల నిపుణుడైన బాలీవుడ్ సూపర్‌స్టార్ ను కలడంతో ఆయన మార్గదర్శనంలోనే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చింది. నేను ఎవ్వరి గురించి చెబుతున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుందని కంగనా పోస్టులు పెట్టింది.