నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు..కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు కమల్ లేఖ
కన్నడ భాష వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన ఆయన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు
By Knakam Karthik
నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు..కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు కమల్ లేఖ
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కమల్ కామెంట్సపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో పాటు ఆయన నటించిన థగ్ లైఫ్ మూవీ రిలీజ్‌ను కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కన్నడ భాష వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన ఆయన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు.
ఆ లేఖలో, రాజ్‌కుమార్ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ, తాను చేసిన వ్యాఖ్యలను కన్నడ ప్రజలు అపార్థం చేసుకోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. "తమిళ, కన్నడ ప్రజలు ఒకే కుటుంబం అని చెప్పడమే నా ఉద్దేశం. అంతే తప్ప, కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడాలన్నది నా అభిమతం కాదు" అని స్పష్టం చేశారు. తన మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రజల పట్ల ఉన్న అత్యంత గౌరవంతో నేను ఈ లేఖ రాస్తున్నాను."
కమల్ ఏమన్నారంటే?
ఇటీవల జరిగిన 'థగ్ లైఫ్' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కమల్ హాసన్ కన్నడ భాష పరిణామం గురించి మాట్లాడారు. తమిళ భాష నుంచి కన్నడ ఉద్భవించిందని పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు కమల్ నిరాకరించారు. ప్రేమతో అన్న మాటలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దీనితో థగ్ లైఫ్ విడుదలను ఆపేస్తూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) నిర్ణయించింది. దీనితో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్ట్‌ను ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా కమల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన కేఎఫ్‌సీసీకి లేఖ రాశారు.