వెనక్కు తగ్గని కమల్ హాసన్

నటుడు కమల్ హాసన్ తన కొత్త చిత్రం థగ్ లైఫ్ విడుదల, ప్రదర్శనను కర్ణాటక రాష్ట్రంలో నిర్ధారించాలని ఆదేశాలు కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

By Medi Samrat
Published on : 2 Jun 2025 7:52 PM IST

వెనక్కు తగ్గని కమల్ హాసన్

నటుడు కమల్ హాసన్ తన కొత్త చిత్రం థగ్ లైఫ్ విడుదల, ప్రదర్శనను కర్ణాటక రాష్ట్రంలో నిర్ధారించాలని ఆదేశాలు కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కన్నడ భాష మూలాల గురించి ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విస్తృత వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా కర్ణాటకలో సినిమాను విడుదల చేయనివ్వమని కూడా హెచ్చరించారు.

కన్నడ భాష తమిళం నుండి ఉద్భవించిందని కమల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. మే 24న చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కన్నడ తమిళం నుండి పుట్టిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. జూన్ 5న థియేటర్లలోకి రానున్న థగ్ లైఫ్ సినిమా విడుదలను నిలిపివేయాలన్న పిలుపుల మధ్య, రాష్ట్రంలో సినిమా విడుదలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చట్టపరమైన జోక్యం కోరాడు.

Next Story