ఆస్పత్రిలో చేరిన లోకనాయకుడు కమల్‌హాసన్.. ఆందోళనలో అభిమానులు..!
Kamal Haasan admitted to Chennai hospital due to ill health.కమల్ హాసన్ బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు
By తోట వంశీ కుమార్ Published on 24 Nov 2022 8:52 AM ISTలోకనాయకుడు కమల్ హాసన్ బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయన్ను చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. కమల్ ఆస్పత్రిలో ఉన్నారు అన్న వార్త తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఉన్న ఆస్పత్రికి అభిమానులు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కమల్ ఆరోగ్యంపై ఇంత వరకు ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు.
మరో రెండు రోజులు ఆయనకు పూర్తి విశ్రాంతిని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ రోజు తర్వాత నటుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కమల్ హాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పుడు కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. బుధవారం కమల్ హాసన్ హైదరాబాద్‌కు వచ్చారు. తన గురువైన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసి వెళ్లారు. వీల్‌ఛైర్‌లో ఉన్న కె.విశ్వనాథ్ చేయిని కమల్ పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన అనంతరం కమల్ అస్వస్థతకు గురైయ్యాడు. కమల్, విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'స్వాతిముత్యం', 'శుభ సంకల్పం', 'సాగర సంగమం' చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ మరిచిపోలేరు.
చాలా రోజుల తరువాత 'విక్రమ్' చిత్రంతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు కమల్ హాసన్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల కోట్లను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్-2' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు కమల్. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇక బిగ్ బాస్ తమిళ సీజన్ 6 హోస్ట్‌గా కమల్ బిజీగా ఉన్నారు. గత ఆరు సీజన్‌లుగా ఈ షోకి యాంకర్‌గా ఉన్నారు.