'బింబిసార-2'లో ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన హీరో
Kalyanaram gave clarity about ntr in bimbisara-2. నందమూరి హీరో కల్యాణ్‌రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఈ సినిమా ఆగస్టు 5 రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ సీక్వెల్ కూడా
By అంజి Published on 31 July 2022 4:44 PM ISTనందమూరి హీరో కల్యాణ్‌రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఈ సినిమా ఆగస్టు 5 రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ సీక్వెల్ కూడా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే 'బింబిసార-2'లో హీరో ఎన్టీఆర్ కూడా నటించే అవకాశముందని కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా వీటిపై కల్యాణ్‌రామ్ క్లారిటీ ఇచ్చారు. 'బింబిసార-2'లో ఎన్టీఆర్ నటిస్తాడన్నది అవాస్తవమన్నారు. ఆ విషయం గురించి తానెక్కడా ప్రస్తావించలేదన్నారు. ఇది ఊహాగానం మాత్రమేనని, ఈ స్టోరీ రెండు పార్టుల్లో చెప్పాలని ముందుగానే నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఈ మూవీ సీక్వెల్‌కు తగ్గట్టు స్క్రిప్టు కూడా సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతానికి బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని పార్ట్ 1ని తెరకెక్కించామని, ఇది ప్రేక్షకులకు నచ్చితే.. పార్ట్ 2 ఎప్పుడొస్తుందనే ఆసక్తి మొదలవుతుందని, అప్పుడు మేం 'బింబిసార 2'ను మరింత అద్భుతంగా తెరకెక్కించగలమని కల్యాణ్ రామ్ అన్నారు. ఇక కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వచ్చి, సినిమాలు చూస్తారని, తెలుగు వారికి ఉన్న ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమానే అని అన్నారు. 'మగధీర', 'బాహుబలి'తో తమ సినిమాను పోల్చడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.
ఈ సినిమా నిర్మాణ విషయంలో నిర్మాత హరి ఎక్కడా తగ్గలేదని, విజువల్స్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను ఓ స్థాయిలో రూపొందించారని కల్యాణ్ రామ్ చెప్పారు. బింబిసార' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో అభిమాని చనిపోవడం చాలా బాధకరమని, ఇకపై అభిమానుల సమక్షంలో జరిగే వేడుకల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటామని చెప్పారు. సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'లో కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. కొత్త దర్శకుడు వశిష్ఠ్ తెరకెక్కించిన ఈ సినిమా మరో ఐదు రోజుల్లో విడుదల కానుంది.