అదిరిపోయిన క‌ళ్యాణ్‌రామ్ 'అమిగోస్' టీజ‌ర్‌

Kalyan Ram Amigos teaser out.త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2023 12:02 PM IST
అదిరిపోయిన క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ టీజ‌ర్‌

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను చేస్తూ త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. చాలా రోజుల త‌రువాత 'బింబిసార' చిత్రంతో సాలీడ్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. సోషియో ఫాంట‌సీ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం థియేట‌ర్ల వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్ర స‌క్సెస్‌తో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. అందులో రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'అమిగోస్' చిత్రం ఒక‌టి.

క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. చిత్ర‌బృందం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆస‌క్తిని క‌లిగించాయి. తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. విజువ‌ల్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. "మనం కలవడం ఓ అద్భుతం.. విడిపోవడం అవసరం" అంటూ కళ్యాణ్‌ రామ్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. ఆద్యంతం టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story